భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి దగ్గరగా ఉండే దిల్లీ పరిసరాల్లో వరద ముంచెత్తింది. ఉస్మాన్పుర్లో వరదల ధాటికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ గర్భిణితో పాటు ఆమె కుటుంబం రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవించింది.
గర్భిణి అయిన నూర్జహాన్... ఉస్మాన్పుర్లోని ఓ గుడిసెలో నివసిస్తోంది. మంగళవారం రాత్రి వరద బీభత్సానికి ఆ ఇల్లు నేలమట్టం అయింది. ఆమెతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ చెక్క సాయంతో చెట్టు ఎక్కారు. కాసేపటికి వచ్చిన ఆమె భర్త కూడా భయంతో వారి వద్దకు చేరాడు. ఇలా రాత్రంతా చెట్టుపైనే ఆ కుటుంబం గడిపింది.