కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప 2 రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
మంత్రివర్గ విస్తరణకు యడియూరప్ప సమాయత్తం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఈనెల 16న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరనున్నారు యడియూరప్ప.
మోదీ, షా తో భేటి కానున్న యడియూరప్ప
తొలిదశలో 10-12 మందికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మంత్రివర్గ కూర్పు చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి రోజులు దాటుతున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: 'కోర్టుల్లో అసంబద్ధ వాదనలు పెరిగిపోతున్నాయి'
Last Updated : Sep 27, 2019, 3:46 AM IST