తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్​ జెట్లకు పక్షులతో పొంచి ఉన్న ముప్పు' - అంబాలాకు రఫేల్

అంబాలా వైమానిక స్థావరం పరిసరాల్లో పక్షుల బెడదను నివారించాలని హరియాణా ముఖ్య కార్యదర్శికి ఎయిర్​మార్షల్​ మన్వేంద్ర సింగ్ లేఖ రాశారు. వీటి కారణంగా యుద్ధ విమానాలకు ముఖ్యంగా కీలకమైన రఫేల్​ జెట్లకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.

Rafale at Ambala base
రఫేల్​

By

Published : Sep 2, 2020, 12:10 PM IST

హరియాణా అంబాలాలోని వైమానిక స్థావరం చుట్టూ ఎగురుతున్న పక్షులతో యుద్ధ విమానాలకు ప్రమాదం ఏర్పడుతుందని భారత వాయుసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు హరియాణా ముఖ్య కార్యదర్శికి ఎయిర్​ మార్షల్​ మన్వేంద్ర సింగ్ లేఖ రాశారు.

ముఖ్యంగా కొత్తగా దిగుమతి చేసుకున్న రఫేల్​ జెట్లకు పక్షులు ముప్పు కలిగిస్తాయని లేఖలో పేర్కొన్నారు సింగ్.

"వైమానిక స్థావరం పరిసరాల్లో చిన్న, పెద్ద పక్షులు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం చెత్త సేకరణను మెరుగుపరచాలి. చెత్త పడేసేవారిపై జరిమానా విధించాలి. ఎయిర్​ఫీల్డ్​ పరిసరాల్లో పావురాల పెంపకాన్ని నిషేధించాలి" అని మన్వేంద్ర సింగ్​ సూచించారు.

ఈ చర్యలు క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా అంబాలా పరిపాలన విభాగాన్ని ఆదేశించాలని కోరారు.

నగర పాలిక చర్యలు..

వాయుసేన సూచనల మేరకు అంబాలా నగరపాలిక అధికారి అనిల్ రానా ఓ ప్రకటన చేశారు.

"అంబాలా వైమానిక స్థావరం పరిసరాల్లో పావురాల పెంపకాన్ని ఆపేయాలని ఆదేశించాం. స్థావరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరూ పక్షులను పెంచేందుకు అనుమతి లేదు. రఫేల్​ చాలా కీలకమైన యుద్ధవిమానం. పరిస్థితిని అర్థం చేసుకుని పక్షుల పెంపకానికి ప్రజలు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటాం."

- అనిల్ రానా, అంబాలా నగరపాలిక అధికారి

ఇదీ చూడండి:ఇంటి పంటతో ఆరోగ్యం మరింత పదిలం!

ABOUT THE AUTHOR

...view details