నీళ్లపై తేలియాడే యోగా... ప్రపంచ రికార్డుపై బుడతడి గురి! ప్రపంచం వేగంగా దూసుకెళుతోంది. అంతే వేగంగా ఉన్నారు నేటి తరం పిల్లలు. ఏడేళ్ల ఓ బుడతడు ఏకంగా ప్రపంచ రికార్డుపైనే కన్నేశాడు. యోగా సాధన ద్వారా నీటిపై తేలియాడటంలో నూతన రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించాడు.
ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయంలో చోటు దక్కించుకునేందుకు రెండు గంటల ఆరు నిమిషాల పాటు యోగాసనం వేసి నీటిపై తేలియాడాడు తిరువనంతపురానికి చెందిన ప్రతీశ్.
ప్రతీశ్ తండ్రి సతీశ్‌కుమార్ సైన్యంలో పనిచేస్తారు. స్వతహాగా యోగాసాధకుడైన సతీశ్ తన కుమారుడికి శిక్షణ ఇచ్చారు. తాజా ఫీట్‌ను ప్రపంచ రికార్డు గ్రహీత డా.జస్టిన్ సమక్షంలో చేసి చూపించాడు ప్రతీశ్.తొలుత గంటపాటు నీటిపై తేలియాడాలని సంకల్పించాడు. కానీ ఏకంగా రెండు గంటల ఆరు నిమిషాల పాటు నీటిపై యోగా చేశాడు. ఇతడి ఘనతను ప్రపంచ రికార్డుల విశ్వవిద్యాలయం అధికారికంగా గుర్తించాల్సి ఉంది.
ఇదీ చూడండి: సభలో బలనిరూపణకు సిద్ధమైన కుమారస్వామి