ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో 'నిర్భయ' తరహా ఘటన జరిగింది. ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేలో కదులుతున్న కారులో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు మృగాళ్లు. యువతి మరణించినట్లు భావించి కారులో నుంచి తోసేశారు.
ఎక్స్‌ప్రెస్ వేపై యువతిని గుర్తించిన యూపీఈఐడీఏ సిబ్బంది బెహట్ ముజావర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.