వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఎంత ప్రాచుర్యం పొందిందో నేటి తరానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువతతోపాటు, గృహిణులు, పెద్దలు చాలా మంది ఈ యాప్‌లో మునిగిపోతూ.. ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. అయితే ఈ టిక్ టాక్ ద్వారా యువత పెడ ధోరణి పడుతుందని ఆరోపిస్తూ, యాప్‌పై నిషేధం విధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ముగ్గురు పిల్లల తల్లైన ముంబయి నివాసి హీనా దర్వేశ్ నవంబర్ 11న ఈ పిటిషన్ దాఖలు చేశారు. టిక్ టాక్.. ఆత్మహత్యలు సహా చాలా నేరాలకు కారణమవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.