తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి - పాక్ కాల్పుల్లో ఓ మహిళ మృతి

కశ్మీర్​ పూంఛ్​ జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోంది. దాయాది దుశ్చర్యలకు భారత భద్రతాదళాలు దీటుగా స్పందిస్తున్నాయి. పాక్ కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నాలుగు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.

మరోసారి పాక్​ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి

By

Published : Oct 15, 2019, 7:18 PM IST

Updated : Oct 15, 2019, 8:50 PM IST

మరోసారి పాక్​ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి

పాకిస్థాన్​ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కశ్మీర్​ పూంఛ్​​ జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి ఉన్న గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. ఫలితంగా ఓ 24 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో నాలుగు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. చాలా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఉదయం 9.30 గంటల నుంచి పూంఛ్​లోని కస్బా, కిర్ని సెక్టార్ల వెంబడి చిన్న ఆయుధాలు, మోర్టార్​ షెల్​లతో పాక్ సైన్యం దాడులు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. భద్రతాదళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నాయని చెప్పారు.

పాక్​ దాడుల వల్ల సమీపంలోని షాపూర్ సెక్టార్​ ప్రజలు భయాందోళనలకు గురయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాల్పుల సమయంలో ఎక్కువ మంది ఇళ్లలోనే తలదాచుకున్నారని, మోర్టార్​ షెల్​ తగలడం వల్ల 'అక్తర్' అనే మహిళ మృతిచెందిందని ఆయన వెల్లడించారు.

గత నాలుగు రోజుల్లో వేర్వేరు చోట్ల పాక్ చేసిన దాడుల్లో మరణించినవారి సంఖ్య 3కు చేరింది.

ఇదీ చూడండి: బంగారం మళ్లీ వృద్ధి బాట.. నేడు 10 గ్రాముల ధరెంతంటే?

Last Updated : Oct 15, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details