తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వివాహిత ఉన్న చోటు నుంచే కేసు వేయొచ్చు' - ఉత్తరప్రదేశ్

వరకట్నం, గృహ హింస, వేధింపులకు గురైన మహిళలు తాము ఆశ్రయం పొందిన చోటు నుంచే భర్త, అత్తమామలపై క్రిమినల్​ కేసులు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

'వివాహిత ఉన్న చోటు నుంచే కేసు వేయొచ్చు'

By

Published : Apr 9, 2019, 3:30 PM IST

Updated : Apr 9, 2019, 4:51 PM IST

'వివాహిత ఉన్న చోటు నుంచే కేసు వేయొచ్చు'

అత్తారింటి నుంచి ఓ వివాహితను బయటకు గెంటివేస్తే, ఆమె ఆశ్రయం పొందిన ప్రదేశం నుంచే భర్త, అత్తమామలపై క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి​ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం.. కీలక తీర్పు వెలువరించింది. ఓ వివాహిత వరకట్నం, గృహహింస కేసులను ఎక్కడ (ఏ ప్రదేశం) నుంచి దాఖలు చేయాలన్న విషయంపై స్పష్టతనిచ్చింది.

ఓ స్త్రీ వివాహానికి ముందు, తరువాత ఏఏ ప్రాంతాల్లో నివసించిందో, ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఆశ్రయం పొందుతోందో, ఆయా ప్రాదేశిక అధికార పరిధుల్లో వివాహ సంబంధ కేసులు దాఖలు చేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్​కు చెందిన రూపాలీదేవి దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.

Last Updated : Apr 9, 2019, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details