అందుబాటులో వైద్య సౌకర్యాలు లేక ఓ మహిళ పురిటి నొప్పులతోనే నదిని దాటి ప్రసవించింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో జరిగింది. అయితే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఏం జరిగింది?
అందుబాటులో వైద్య సౌకర్యాలు లేక ఓ మహిళ పురిటి నొప్పులతోనే నదిని దాటి ప్రసవించింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో జరిగింది. అయితే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఏం జరిగింది?
నాబరంగపూర్ జిల్లాలోని తెంతులికుంతికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే దగ్గరలో ఆసుపత్రిలేదు. అంబులెన్సూ రాలేదు. దాంతో నదిని దాటుకుంటూ వెళ్లిన ఆమె.. పొదగడ్ డ్యాం పక్కన ప్రసవించింది.
ఆలస్యంగా వచ్చిన అంబులెన్సులో ఆ బాలింతను, శిశువును వైద్యసిబ్బంది తెంతులికుంతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:ఒడిశాలో 2000 కిలోల గంజాయి పట్టివేత