బెంగళూరులో ఓ యువతి ప్రేమ కాటుకు బలైపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నానంటూ వచ్చిన ఓ ప్రబుద్ధుడి చేతిలో మోసపోయిన 29ఏళ్ల యువతి.. తీవ్ర మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు వీడియో చిత్రీకరించింది.
మోసపోయానని..

తవరకేరులోని కృష్ణమూర్తి లే అవుట్లో మే 28న ఈ ఘటన జరిగింది. చనిపోయిన యువతి, దినేశ్ అనే వ్యక్తి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాటలతో పాటు మనసులు కలవడం వల్ల ప్రేమలో మునిగిపోయారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి.. రూ.5 లక్షలు తీసుకున్నాడు దినేశ్. అంతే ఏమైపోయాడో తెలియదు. మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత తెలిసింది తాను మోసపోయానని. ఏం చేయాలో తెలియక తీవ్ర క్షోభ అనుభవించి చివరికి ప్రాణం వీడింది.
చనిపోయే ముందు తీసిన వీడియోలో తన చావుకు కారణం దినేశ్ అని చెప్పింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:-పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర