సాధారణంగా ఎవరైనా పాము కాటేస్తే ఏం చేస్తారు? భయంతో పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు.. కదా! కానీ ఓ మహిళా రైతు.. తనను కాటేసిన పామును చంపేసి, దానిని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి... వైద్యం చేయమని అడిగింది. ఈ ఘటన కర్ణాటక బీదర్లో జరిగింది.
'ఈ పామే నన్ను కాటేసింది డాక్టర్ గారూ!' - కర్ణాటకలో తనను కాటేసిన పామును ఆసుపత్రికి తీసుకెళ్లిన మహిళా రైతు
ఓ మహిళా రైతు తనను కాటేసిన పామును తీసుకొని నేరుగా ఆసుపత్రికి వెళ్లి అందరినీ కంగారు పెట్టిన ఘటన కర్ణాటక బీదర్లో జరిగింది. మొదట పామును చూసి భయపడిన వైద్యులు.. తరువాత తేరుకుని బాధితురాలికి వైద్యం అందించారు.
బీదర్ జిల్లా బాల్కి తాలూకాలోని తల్వాడ్ (ఎం) గ్రామానికి చెందిన షీలాబాయి అనే మహిళా రైతు.. పొలం పనులు చేసుకుంటూ ఉండగా పాము కరిచింది. దీనితో కంగారుపడిన ఆమె పక్కనున్న ఓ రాయిని తీసుకుని పామును చంపేసింది. తరువాత దానిని మంటల్లో వేసి కాల్చింది. తరువాత ఏమనుకుందో ఏమో.. ఆ పామును మంటల్లో నుంచి తీసి.. నేరుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. 'ఈ పామే నన్ను కాటేసింది' అని వైద్యులకు చూపించింది. మొదట కంగారుపడిన వైద్యులు.. తరువాత ఆమెకు వైద్యం అందించారు.
ఇదీ చూడండి:'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి
TAGGED:
కర్ణాట మహిళా రైతు