భాజపా సర్కారుపై కాంగ్రెస్ మరోమారు విరుచుకుపడింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ సర్కారు విఫలమైందని హస్తంపార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఉపాధి కొరవడితే.. యువతకు సరైన అవకాశాలు కల్పించలేమని.. అలాంటప్పుడు యువత తమ కలలను సాకారం చేసుకోలేరని వివరించారు. గత ఐదేళ్లలో ఏడు ప్రధాన రంగాల్లోని 3.64కోట్ల మంది నిరుద్యోగులుగా మారారన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో గణతంత్ర రాజ్యం ఎలా బలంగా ఉంటుందని ప్రశ్నించారు.
" గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉద్యోగం పొందేందుకు అష్టకష్టాలు పడుతున్న లక్షలాది మంది పట్టభద్రుల గురించి ఆలోచించాలి. చదువు పూర్తి చేసుకున్న వారు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఉద్యగం ఎంతో సాయపడుతుంది. ఉద్యోగావకాశాలు లేకపోతే.. యువత వారి కలలను ఎలా సాకారం చేసుకుంటుంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత