తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'

ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ కుల రాజకీయాలు చేయలేదన్నారు ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ. ఆయనకు జాతీయవాదమే ప్రధానాంశమని స్పష్టం చేశారు. మోదీ సామాజిక వర్గంపై ప్రతిపక్ష నేతలు చేసిన ట్వీట్లకు బదులిచ్చారు జైట్లీ. కుల రాజకీయాలు చేసి కొన్ని పార్టీలు కోట్లు దండుకున్నాయని ఆరోపించారు.

jaitley

By

Published : Apr 29, 2019, 7:47 AM IST

మోదీపై కుల రాజకీయ రంగు పులమొద్దు: జైట్లీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుల రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ. ఆయనకు జాతీయవాదమే ఆదర్శమన్నారు.
మోదీ కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు పి. చిదంబరం, ఆర్​జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ట్వీట్లకు బదులిచ్చారు జైట్లీ.

" ప్రధాని కులంతో సంబంధమేంటి? ఆయన ఏనాడు కుల రాజకీయాలు చేయలేదు. జాతీయవాదమే ఆయనకు ఆదర్శం. కులాలపై రాజకీయం చేసే వారు విజయం సాధించలేరు. వీటి పై రాజకీయం చేసి కోట్లు సంపాదించుకున్నాయి బీఎస్​పీ, ఆర్​జేడీ వ్యవస్థాపకుల కుటుంబాలు. వారికున్న ఆస్తుల్లో ప్రధానికి 0.01శాతం కూడా లేవు."
-ట్విట్టర్​లో జైట్లీ

"నేను అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వాడిని. నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దని మాయావతిని అభ్యర్థిస్తున్నా. 130 కోట్ల మంది నా కుటుంబం" అని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్​లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్​ స్పందించారు. ఉన్నత కులంలో పుట్టిన మోదీ ఓబీసీ అని చెప్పుకుంటారని, ఓట్ల కోసం ఆయన ఏమైనా చేస్తారని ట్వీట్​ చేశారు.

ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్​ నేత పి. చిదంబరం ట్వీట్ చేశారు. మోదీ ఓబీసీకి చెందినవారని గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఇప్పుడేమో కులం లేదంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు చాయ్​వాలా అని చెప్పుకున్న ఆయన ఇప్పడేమో ఆ ఊసే ఎత్తట్లేదని ఆరోపించారు. ప్రజల్ని అవివేకులనుకుంటున్నారా? అని విమర్శించారు చిదంబరం.

ఇదీ చూడండి:ఆర్టికల్ 370, 35ఏలను రద్దుచేయాలి:రాజ్​నాథ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details