దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80 లక్షల 88 వేలు దాటాయి. 48 వేల 648 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 563 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇంకా క్రియాశీల కేసులు 6 లక్షల దిగువకు చేరాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 91 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల రేటు 1.50 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది.