తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఏడాది మరింత చల్లగా శీతాకాలం- కారణమిదే!

'లానినో' ప్రభావం వల్ల ఈ ఏడాది శీతాకాలంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మోహనపాత్ర చెప్పారు.

IMD-WINTER
శీతకాలం

By

Published : Oct 14, 2020, 5:07 PM IST

ఈ ఏడాది శీతాకాలం మరింత చల్లగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇందుకు 'లానినో' పరిస్థితులే కారణమని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు.

'కోల్డ్ వేవ్​ రిస్క్ రిడక్షన్​' అనే వెబినార్​లో పాల్గొన్న మృత్యుంజయ.. వాతావరణ మార్పులు కేవలం ఉష్ణోగ్రతలు పెరుగుదలతో పాటు అనిశ్చితికి దారితీస్తాయని అన్నారు. 'లానినో' పరిస్థితుల వల్ల చలిగాలులు మరింత పెరిగే ఆస్కారం ఉంటుందన్న ఆయన... 'ఎల్​నినో' ప్రభావం ఇందుకు విరుద్ధమని తెలిపారు.

రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్, బిహార్​ రాష్ట్రాల్లో చలిగాలుల కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందన్నారు.

ఇదీ చూడండి:దారితప్పిన భారీ కొండచిలువ చివరకు అడవికి...

ABOUT THE AUTHOR

...view details