ప్రతిపక్షాలపై విమర్శలను తీవ్రతరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో అస్థిరత నెలకొల్పి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అబద్ధాల పుట్టగా అభివర్ణించారు ప్రధాని. అందులోని అంశాలు సైనికులను అవమాన పరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
మహారాష్ట్ర గోందియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను.. చక్కదిద్దేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కాంగ్రెస్-ఎన్సీపీ సానుభూతి కనబరుస్తున్నాయని ఆరోపించారు మోదీ