తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ సేవకు శక్తినంతా ధారపోస్తా: అమిత్​ షా - cabinet

దేశ సేవ కోసం తన శక్తి సామర్థ్యాల మేర కృషి చేస్తానని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. తనపై విశ్వాసం ఉంచి కేబినెట్​లో చోటు కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.  కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వరుస ట్వీట్లు చేశారు షా.

దేశ సేవకు శక్తినంతా ధారపోస్తా: అమిత్​ షా

By

Published : May 31, 2019, 7:35 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన కేబినెట్​లో అమిత్​ షాకు చోటు దక్కింది. కేంద్ర మంత్రిగా మొదటి సారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు షా. గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు.

"నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మీ నాయకత్వం, మద్దతు ఆదర్శప్రాయం. దేశ ప్రజలకు సేవ చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా"
-అమిత్​ షా ట్వీట్​

వరుసగా రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రాత్మకమన్నారు షా.

" దేశానికి చరిత్రాత్మకమైన క్షణం. వరుసగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం ఉన్నత స్థానానికి చేరుకుంటుందని విశ్వసిస్తున్నా. "
-అమిత్​ షా ట్వీట్​

"గత ఐదేళ్లలో భారతదేశం అన్ని విభాగాల్లో గణనీయ వృద్ధి సాధించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం సరికొత్త భారత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరుకోవడమే కాదు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. "
-అమిత్​ షా ట్వీట్​

మోదీ సహా 58 మంది కేంద్ర మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చూడండి: నమో 2.0​: మంత్రివర్గంలో 21 మంది కొత్తవారు

ABOUT THE AUTHOR

...view details