తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్​

చంద్రయాన్​-2 అందించిన అనుభవమే చంద్రునిపైకి మనల్ని తీసుకెళుతుందని ఇస్రో ఛైర్మన్​ డాక్టర్​ కె.శివన్​ పేర్కొన్నారు. దిల్లీ ఐఐటీ 50వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. త్వరలో చంద్రునిపై అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Nov 2, 2019, 3:21 PM IST

Updated : Nov 2, 2019, 11:33 PM IST

IIT-ISRO-CONVOCATION

త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్​

చంద్రయాన్-2 మిషన్ అనుభవంతో త్వరలోనే చంద్రుడిపై దిగుతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ ఐఐటీ 50వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శివన్​. వైఫల్యాలు అనేవి నేర్చుకోవడానికి దొరికిన అవకాశమని.. ఆ అనుభవంతో విజయం సాధించాలని యువతకు సూచించారు.

"ఈ రోజు మన రాకెట్లు చంద్రుడు, అంగారకుడిని తాకాయి. మీరందరూ చంద్రయాన్​-2 గురించి వినే ఉంటారు. నిజమే.. సాంకేతికంగా మనం లక్ష్యాన్ని చేరలేకపోయాం. కానీ ల్యాండింగ్​కు 300 మీటర్ల వరకు అన్ని వ్యవస్థలు పనిచేశాయి. దీన్ని సరిచేసుకునేందుకు ఎంతో విలువైన సమాచారం మన దగ్గర ఉంది. కృషి, పట్టుదల, పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ను సాధ్యం చేస్తాం."

- డాక్టర్​ కె.శివన్​, ఇస్రో ఛైర్మన్​

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రణీత్​కు బంగారు పతకంతో పాటు.. పట్టాను అందించారు శివన్​. ఐఐటీ దిల్లీ నుంచి 2,042 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పట్టభద్రులుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

Last Updated : Nov 2, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details