సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2020 మార్చి 31 నాటికి 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భాజపా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయిందని రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. భాజపా అసంబద్ధ విధానాల వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు.