తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాపై సైద్ధాంతిక పోరు ఆగదు : రాహుల్​

భాజపా, ఆర్​ఎస్​ఎస్​పై సైద్ధాంతిక పోరు ఆగదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తానెప్పుడూ పేదల పక్షానే ఉంటానన్నారు మాజీ కాంగ్రెస్​ అధ్యక్షుడు.

By

Published : Jul 4, 2019, 1:21 PM IST

భాజపాపై సైద్ధాంతిక పోరు ఆగదు : రాహుల్​

భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​​)పై తన సైద్ధాంతిక పోరు ఆగదని స్పష్టం చేశారు రాహుల్​ గాంధీ. గత ఐదేళ్లతో పోలిస్తే 10 రెట్లు రెట్టించిన శక్తితో వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. తానెప్పుడూ పేదలు, రైతులు, కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు​.

భాజపాపై సైద్ధాంతిక పోరు ఆగదు

ఆర్​ఎస్ఎస్​, భాజపా సిద్ధాంతాలే గౌరీ లంకేశ్​ ప్రాణాలు తీశాయని రాహుల్​ గతంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై వేసిన పరువునష్టం కేసు విచారణ నిమిత్తం ముంబయి కోర్టులో హాజరయ్యారు రాహుల్​. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.

పార్టీ అధ్యక్ష పదవి రాజీనామాపై పాత్రికేయులు ప్రశ్నించగా... తాను చెప్పదల్చుకున్నదంతా నాలుగు పేజీల రాజీనామా లేఖలో సమగ్రంగా చెప్పానని... ఇక చెప్పడానికి ఏమీ లేదన్నారు రాహుల్​ గాంధీ.
రాజీనామా వెనక్కి తీసుకోవాలని నినాదాలు

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్​ కొనసాగాలని ముంబయి కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు పార్టీ కార్యకర్తలు. రాజీనామాను వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details