తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరికి తలారీగా పవనే ఎందుకు? - జాతీయ వార్తలు

నిర్భయ కేసులో తలారీ ఏర్పాటుపై తిహార్ జైలు అధికారులు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మేరఠ్​కు చెందిన తలారీ పవన్​ అయితే అన్ని విధాల సరైన వ్యక్తిగా భావించిన అధికారులు.. ఈ మేరకు యూపీ జైళ్ల శాఖ అధికారికి అర్జీ పెట్టుకున్నారు.

nirbhaya case
nirbhaya case

By

Published : Jan 9, 2020, 11:28 AM IST

Updated : Jan 9, 2020, 7:44 PM IST

నిర్భయ కేసు దోషులకు మరణ శిక్ష అమలుకు మరికొన్ని రోజుల సమయమే మిగిలుంది. ఈ నేపథ్యంలో తలారీగా మేరఠ్​కు చెందిన పవన్​ కావాలంటూ ఉత్తర్​ప్రదేశ్​ జైళ్ల శాఖకు తిహార్​ డైరక్టరేట్​ లేఖ రాసి అర్జీ పెట్టుకుంది.

"తలారీగా పవన్​ను మాత్రమే ఎంపిక చేసుకోవడానికి మా వద్ద అనేక కారణాలు ఉన్నాయి. పవన్​ తండ్రి, తాతలు తలారీలు. అందువల్ల తప్పు చేయడానికి అవకాశం తక్కువ. మరొకటి.. పవన్​ శారీరకంగా దృఢంగా ఉన్నాడు. కంటి చూపుతోపాటు అన్ని అంశాలు అవసరానికి తగినట్లుగా ఉన్నాయి."

-లేఖ సారాంశం

పవన్​ భద్రతకు సంబంధించి తామే చర్యలు తీసుకుంటామని యూపీ డైరెక్టరేట్​కు తిహార్ జైలు తెలిపింది. ఒకవేళ యూపీ జైళ్ల శాఖ పవన్​కు భద్రత కల్పించటం వీలుకాకపోతే ఆ బాధ్యత కూడా తామే తీసుకుంటామని తిహార్ జైలు తెలిపింది.

నిర్భయ కేసులో దోషులకు దిల్లీ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది. ఈ నెల 22న ఉరి తీయనున్నారు అధికారులు.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల 'ఉరి'కి ట్రయల్స్​- మేరఠ్ నుంచే తలారి!

Last Updated : Jan 9, 2020, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details