భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లద్దాక్ సరిహద్దులో జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి చైనాకు ఎంత ధైర్యమని వ్యాఖ్యానించారు. భారత్-చైనా సరిహద్దులో ఒకప్పుడు విధులు నిర్వహించిన మాజీ సైనికాధికారి ఇంటర్వ్యూను ట్వీట్‌కు జత చేశారు రాహుల్.
'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?' - రాహుల్ గాంధీ వార్తలు
లద్దాక్ సరిహద్దులో మన జవాన్లను ఆయుధాలు లేకుండా ఎందుకు పంపారని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మన సైనికులపై దాడిచేయడానికి చైనాకు ఎంత ధైర్యమని ట్వీట్ చేశారు.
'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'
గాల్వన్ లోయలో 20మంది జవాన్లు అమరులైన ఘటనకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను బుధవారం ప్రశ్నించారు రాహుల్. అమర వీరులకు నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్లో చైనాను ఎందుకు ప్రస్తావించలేదని ట్వీట్ చేశారు. చైనా పేరు ప్రస్తావించకుండా సైన్యాన్ని అవమానించారని మండిపడ్డారు. జవాన్లు మరణిస్తున్నా ఎన్నికల ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నారని అడిగారు.