తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐదేళ్ల పాలనలో మీరేం చేశారు?' - UP

కాంగ్రెస్​ పాలనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ విమర్శలను కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. అభివృద్ధిపై నివేదికలు విడుదల చేయటం, ప్రచారాలు చేసుకోవటం కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే వాస్తవం తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్ల పాలనలో మీరేం చేశారు

By

Published : Mar 19, 2019, 9:38 PM IST

ఉత్తరప్రదేశ్​లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రియాంక గాంధీ పర్యటన సందర్భంగా భాజాపా-కాంగ్రెస్​ మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్​లో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్​ రాష్ట్రానికేమీ చేయలేదని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ విమర్శించారు.

భాజపా నాయకుల విమర్శలను ప్రియాంక గాంధీ ఖండించారు. అభివృద్ధిపై నివేదికలు విడుదల చేయటం కాదు. క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే వాస్తవాలేంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు ప్రియాంక గాంధీ.

70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్​ ఏమీ చేయలేదన్న భాజపా విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు. గతాన్ని వదిలేసి ఐదేళ్ల పాలనలో ముందు మీరేం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఐదేళ్ల పాలనలో మీరేం చేశారు

" నివేదికలు చూడటానికి, ప్రచారానికి బాగానే ఉంటాయి. క్షేత్రస్థాయికి వచ్చి చూడండి, అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. నేను ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నా... రైతులు, జవాన్లు, విద్యార్థులు, అంగన్​వాడీ, ఆశా వర్కర్లు ఇలా ఎవరిని కలిసినా సమస్యలే వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అంగన్​వాడీ ఉద్యోగులకు రూ.17 వేల జీతం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గడిచిన రెండేళ్లుగా వారికి 8 వేల రూపాయలే ఇస్తున్నారు. 70 ఏళ్లు కాంగ్రెస్​ ఏం చేసింది..? అనే చర్చకు ముగింపు పలకాలి. ఐదేళ్ల అధికారంలో మీరేం చేశారో? చెప్పండి"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఉత్తరప్రదేశ్​లో యోగి ఆదిత్యానాథ్​ నేతృత్వంలో రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై నివేదికలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్​ రాష్ట్రానికి ఏమీ చేయలేదని సీఎం ఆదిత్యనాథ్​ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details