తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలపాతంతో భద్రం.. వీళ్లిలా బతికి బైట పడ్డారు! - వాటర్ ఫాల్స్

స్నేహితులతో కలిసి జలపాతం అందాలు చూసేందుకు వెళ్లి ఊహించని రీతిలో చిక్కుకున్నారు ఇద్దరు విద్యార్థులు. జలపాతం ఒక్కసారిగా వరదగా ఉగ్ర రూపం దాల్చి ప్రతాపం చూపింది. భయపడిపోయిన విద్యార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని నిలబడిపోయారు. అదృష్టం బాగుండి పోలీసుల సహాయంతో బయటపడ్డారు.

జలపాతంతో భద్రం.. వీళ్లిలా బతికి బైట పడ్డారు!

By

Published : Jul 26, 2019, 7:27 PM IST

జలపాతంతో భద్రం.. వీళ్లిలా బతికి బైట పడ్డారు!
పశ్చిమ బంగా పురులియాలోని ప్రఖ్యాత బమ్ని జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు విద్యార్థులను కాపాడారు స్థానిక పోలీసులు.

అజోధ్య పర్వాతాల్లోని బమ్ని వాటర్ ఫాల్స్​ చూసేందుకు స్నేహితులంతా కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీళ్లంతా కాలేజీ విద్యార్థులు. జలకాలాడేందుకు జలపాతం కింద నిల్చున్నారు. కాసేపు సరదాగా గడిపారు. ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. వరదగా మారి వారిని ముంచేయబోయింది. కొందరైతే ఎలాగోలా సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు కానీ, ఇద్దరు మాత్రం వరద తీవ్రతను ఎదురించలేక అక్కడున్న రాళ్ల వెనకే చిక్కుకున్నారు.

ఎంత సేపటికీ జలపాతంలో ప్రవాహం తగ్గకపోయేసరికి వారిద్దరి పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు చాలా సేపు శ్రమించి ఇద్దరినీ రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details