తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్​ఎస్ఎస్​ని ప్రచారం చేసిన ఇమ్రాన్​కు ధన్యవాదాలు' - ఇమ్రాన్​ఖాన్​

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ చేసిన విమర్శలను ఆర్​ఎస్​ఎస్​ తనదైన రీతిలో తిప్పికొట్టింది. ఆర్​ఎస్​ఎస్​ గురించి ప్రపంచానికి తెలిసేలా బాగా ప్రచారం చేశారని, దీనిని ఇమ్రాన్​ ఆపకుండా కొనసాగించాలని ఎద్దేవా చేసింది. ఇమ్రాన్​ వల్ల నేడు భారత్​... ఆర్​ఎస్​ఎస్​ పర్యాయపదాలు అయ్యాయని వ్యాఖ్యానించింది.

'ఆర్​ఎస్ఎస్​ని ప్రచారం చేసిన ఇమ్రాన్​కు ధన్యవాదాలు'

By

Published : Sep 28, 2019, 4:14 PM IST

Updated : Oct 2, 2019, 8:52 AM IST

ఐరాసలో పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​.. చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) ​ తిప్పికొట్టింది. 'ప్రపంచమంతా భారతదేశాన్ని, ఆర్​ఎస్​ఎస్​ను ఒక్కటిగా చూడాలని కోరుకున్నామని, ఆ పనిని ఇమ్రాన్​ చేశారని' పేర్కొంది.

ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నందునే​ తమను లక్ష్యంగా చేసుకొని ఇమ్రాన్​ఖాన్​... ఐరాసలో విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్​ఎస్​ఎస్​. 'ఇమ్రాన్​ ఆర్​ఎస్​ఎస్​ పేరును వ్యాప్తి చేయడం ముగించారు. కానీ ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపకూడదని కోరుకుంటున్నాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

"ఆర్​ఎస్​ఎస్​ భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది భారత్​ కోసమే పనిచేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా దీని శాఖలు లేవు. మరి పాకిస్థాన్​ మనపై ఎందుకు కోపంగా ఉంది? సంఘ్​పై కోపంగా ఉండటం అంటే అది భారతదేశంపై కోపంగా ఉండటమే. ఇప్పుడు భారత్​, ఆర్​ఎస్​ఎస్ పర్యాయపదాలుగా ఉన్నాయి."

- కృష్ణగోపాల్, ఆర్​ఎస్​ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి

ఉగ్రవాదానికి బలైన వారు, బాధితులు... ఆర్​ఎస్​ఎస్​ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకమని ఇప్పుడు తెలుసుకున్నారని కృష్ణగోపాల్ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​-ముగ్గురు ముష్కరులు హతం

Last Updated : Oct 2, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details