సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఏమాత్రం వెనకాడబోదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. సింగపూర్‌లో జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సంవంలో పాల్గొన్నారు జైశంకర్. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద పన్ను సంస్కరణ.. జీఎస్టీని అమలు చేశామని చెప్పారు.
ఆర్థిక రంగానికి ఊతమివ్వడంతో పాటు, నిరర్ధక ఆస్తులను విడిపించం కోసం దివాలా చట్టాన్ని అమలులోకి తెచ్చామని అన్నారు. ఈ చర్యల కారణంగా భవిష్యత్తులో బ్యాంకులు సమర్థవంతంగా తయారవుతాయని, రుణాలను తిరిగి రాబట్టుకొని, ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నడిపించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.