ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే తమకేమీ అభ్యంతరం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిలోని ముఖ్య నేతల కోసమే ఏడు స్థానాల్లో పోటీకి తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది.
రానున్న ఎన్నికల్లో మొత్తం 12 స్థానాల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనపై మాయావతితో పాటు అఖిలేశ్ యాదవ్ అభ్యతరం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రకటనలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపొద్దని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి భాజపాపై ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"ఉత్తరప్రదేశ్లో భాజపాపై విజయం సాధించే సత్తా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి ఉంది. తప్పుడు సంకేతాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించొద్దు."
- అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత
యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు పోటీ చేయనున్న స్థానాలు