తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ భద్రత అంశంలో కేంద్రాన్ని వ్యతిరేకించం: కాంగ్రెస్​ - కాంగ్రెస్​ సీడీఎస్​

సీడీఎస్​ నియామకాన్ని తమ పార్టీ వ్యతిరేకించదని కాంగ్రెస్​ ప్రకటించింది. అయితే ఈ చర్య ఎంత వరకు ఫలితానిస్తుందో వేచి చూడాలని పేర్కొంది. దేశ భద్రత కోసం కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానైనా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సీడీఎస్​ను వ్యతిరేకించిన నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది.

We don't oppose any step by govt to strengthen security: Cong on CDS
దేశ భద్రత అంశంలో కేంద్రాన్ని వ్యతిరేకించం: కాంగ్రెస్​

By

Published : Jan 2, 2020, 5:47 AM IST

Updated : Jan 2, 2020, 11:03 AM IST

దేశ భద్రత అంశంలో కేంద్రాన్ని వ్యతిరేకించం: కాంగ్రెస్​

దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించబోమని విపక్ష కాంగ్రెస్​ ప్రకటించింది. సీడీఎస్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నియామకంపై ఆ పార్టీ నేతలు అధీర్​ రంజన్​, మనీశ్​ తివారీ విమర్శల వర్షం కురిపించిన తరుణంలో పార్టీ ఈ విధంగా స్పందించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

సీడీఎస్​ను నియమించాలన్న కేంద్ర నిర్ణయం సరైనదా? కాదా అనే విషయం త్వరలోనే ప్రజలకు అర్థమవుతుందన్నారు కాంగ్రెస్​ ప్రతినిధి సుస్మితా దేవ్​. సీడీఎస్​ పనితీరు చూడనంత వరకు ఆ అంశంపై స్పందించడం సరికాదన్నారు.

"సీడీఎస్​ నిమాయకం కేంద్రం నిర్ణయమే. త్రివిధ దళాధిపతిగా రావత్​ ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం. దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కాంగ్రెస్​ వ్యతిరేకించదు."
--- సుస్మితా దేవ్​, కాంగ్రెస్​ ప్రతినిధి.

అయితే సీడీఎస్​ నియమాకం ఓ తప్పటడుగు అని ఆ పార్టీ నేతలు అధీర్​ రంజన్​, మనీశ్​ చేసిన వ్యాఖ్యలపై సుస్మితా స్పందించడానికి నిరాకరించారు.

ఇదీ చూడండి- సీడీఎస్​ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్

Last Updated : Jan 2, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details