రహదారిపై ఓటర్ల బైఠాయింపు... పోలీసుల లాఠీఛార్జీ - పోలింగ్
ఓటు వేయకుండా తమను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుంటున్నారంటూ ఆందోళనకు దిగారు పశ్చిమ్ బంగాల్ ఇస్లామ్పుర్లోని చోప్రా ప్రాంత ఓటర్లు. జాతీయ రహదారిపై బైఠాయించారు. రంగంలోకి దిగిన భద్రతా దళ సిబ్బంది వారిపై లాఠీలు ఝుళిపించారు.
పోలీసుల లాఠీఛార్జ్
పశ్చిమ్ బంగాల్ ఇస్లామ్పుర్ డివిజన్ పరిధిలోని చోప్రా పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తులు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆగ్రహించారు. జాతీయ రహదారి-34పై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. స్థానికులను చెదరగొట్టారు. అల్లర్లు చెలరేగకుండా వీధుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.