గల్వాన్ నదిలో నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రత్యేకమైన వాటర్‌ప్రూఫ్ దుస్తులు సమకూర్చుకోవాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఓవైపు చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో వీటి అవసరం ఉందని సైనిక వర్గాలు చెబుతున్నాయి.
గల్వాన్ లోయలో భారత గస్తీ పాయింట్- 14 సమీపంలో చైనా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే చైనా బలగాలు వాటర్‌ప్రూఫ్ దుస్తులతో సంసిద్ధంగా ఉన్నాయి. ఈ దుస్తుల ద్వారా వాళ్లకు ఉష్ణోగ్రతతో కరిగిన మంచు నీటిలో విధులు నిర్వహించడానికి వీలవుతుందని తెలుస్తోంది. ఈ దుస్తుల వల్లనే జూన్ 15న జరిగిన ఘర్షణలో అల్పోష్ణస్థితి మరణాలను తగ్గించిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఇబ్బందులు తొలగించేందుకు..
అక్సాయిచిన్‌లో పుట్టే గల్వాన్ నది వాస్తవాధీన రేఖ వెంబడి ప్రవహించి గస్తీ పాయింట్(పీపీ)- 14 వద్ద షాయోక్ నదిలో కలుస్తుంది. అంతకుముందు కేఎం-120 పోస్ట్ నుంచి పీపీ- 14 వరకు గస్తీ నిర్వహించే సమయంలో భారత బలగాలను నీటిలో దిగాల్సి వస్తుంది. ఫలితంగా దుస్తులతో పాటు బూట్లు తడిస్తాయని ఓ అధికారి చెప్పారు.
లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఎల్ఏసీ వెంబడి సైన్యాన్ని భారీగా మోహరించింది చైనా. ఓ వైపు భారత్‌తో సైనిక చర్చలు జరుపుతూనే ఇలా దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా స్థావరాలకు ఎదురుగా భారత్ కూడా దీటుగా బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది.
ఇదీ చూడండి:డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్