తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసుల కారుపై పుష్​ అప్స్​.. వీడియో వైరల్​ - దిల్లీ

దిల్లీ పోలీసుల కారుపై ఓ యువకుడు చేసిన ప్రమాదకర విన్యాసాలు​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. కదులుతున్న కారుపై ఒంటిపై చొక్కా లేకుండా ఏకంగా పుష్​ అప్స్​ చేశాడు. ఈ వీడియోని టిక్ టాక్​లో పోస్ట్​ చేశాడు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఈ వీడియో తాజాగా తీసింది కాదని గతంలో ఎప్పుడో తీశారని తెలిపారు.

పోలీసుల కారుపై పుష్​ అప్స్​.. వీడియో వైరల్​

By

Published : Jun 27, 2019, 1:33 PM IST

పోలీసుల కారుపై పుష్​ అప్స్​.. వీడియో వైరల్​

టిక్​ టాక్​లో ప్రాచుర్యం పొందేందుకు దిల్లీకి చెందిన ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా పోలీసుల కారుపైనే ప్రమాదకర విన్యాసాలు చేశాడు. కదులుతున్న కారుపై ఒంటిపై చొక్కా లేకుండా పుష్​అప్స్​ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పోలీసుల నోటీసులు

పోలీసుల కారును ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన యువకుడు... కారు కదులుతుండగానే పైకి ఎక్కి పుష్​ అప్స్ చేశాడు. అది కాస్తా వీడియో తీసి టిక్​టాక్​లో పోస్ట్​ చేశాడు. ఫలితంగా ఈ వ్యవహారం పోలీసుల దాకా చేరింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు వీడియోలో ఉన్న వ్యక్తి రక్షక భటుడు కాదని స్పష్టం చేశారు. ఆ కారును తాము ఓ ప్రైవేటు కాంట్రాక్టర్​ నుంచి అద్దెకు తీసుకున్నామన్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి ఆ కాంట్రాక్టర్​ స్నేహితుడని... అందుకే అతనికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నియమాలు ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ వీడియో కూడా తాజాగా తీసింది కాదని... గతంలో ఎప్పుడో తీశారని సీనియర్​ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : హరియాణా కాంగ్రెస్​ అధికార ప్రతినిధి కాల్చివేత

ABOUT THE AUTHOR

...view details