తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరు పెడళ్ల సైకిల్​.. ఒకేసారి ఆరుగురు తొక్కొచ్చు

కర్ణాటకకు చెందిన యువ ఇంజినీర్లు పర్యావరణహితంగా ఓ వినూత్న సైకిల్​ను రూపొందించారు. ఆరు పెడళ్లతో ఉన్న ఈ సైకిల్​ను ఒకేసారి ఆరుగురు నడపవచ్చు. ఈ సైకిల్​ వల్ల హంపీ పర్యాటకాన్ని మరింత సులభతరం చేసి, అందరితో శభాష్​ అనిపించుకుంటున్నారు యువ ఇంజినీర్లు.

ఈ సైకిల్​ను ఒకేసారి ఆరుగురు నడపొచ్చు

By

Published : Jun 22, 2019, 10:52 AM IST

Updated : Jun 22, 2019, 1:06 PM IST

ఆరు పెడళ్ల సైకిల్​.. ఒకేసారి ఆరుగురు తొక్కొచ్చు

సైకిల్ అంటే సాధారణంగా రెండు పెడళ్లు ఉంటాయి. ఒకరు నడిపితే.. ఇంకొకరు వెనుక కూర్చునే వీలుంటుంది. అయితే ఇందుకు విభిన్నంగా ఆలోచించారు కర్ణాటక బళ్లారిలోని రావ్​ బహదూర్​ కళాశాల ఇంజినీరింగ్​ విద్యార్థులు. వినూత్నంగా ఆలోచించి అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆరు పెడళ్లతో, ఆరుగురు ఒకేసారి నడపగల సైకిల్​ను రూపొందించి అబ్బురపరిచారు. హంపీ పర్యాటకాన్ని మరింత సులభతరం చేశారు.

కళాశాలకు చెందిన 8 మంది మెకానికల్ ఇంజినీరింగ్​ విద్యార్థుల బృందానికి ఎస్​వీ శరణ్​గౌడ, శ్రీకాంత్​ నేతృత్వం వహించారు. ఈ నూతన సైకిల్​కు ఎలాంటి బ్యాటరీలు, ఇంజిన్ ఉండవు. పర్యావరణ కాలుష్యం జరిగే అవకాశం లేదు.

ఒకేసారి ఆరుగురు ఈ సైకిల్​ను నడిపే అవకాశం ఉంది. పూర్తి పర్యావరణ అనుకూలమైన ఈ సైకిల్ రూపొందించడానికి వారికి రూ.50 వేలు ఖర్చయింది.

హంపీని చుట్టేద్దాం

కర్ణాటకలోని హంపీ ప్రసిద్ధ పర్యటక స్థలం. ఇక్కడి పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు దేశ, విదేశీ పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉంటాయి. అందువల్ల మోటారు వాహనాలతో ప్రయాణించడం కష్టం. వీటిని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ, పర్యాటక అనుకూలమైన సైకిల్​ను రూపొందించారు ఈ యువ ఇంజినీర్లు.

ఇదీ చూడండి: తేజస్వీ ఆచూకీ చెబితే రూ.5100 బహుమతి..!

Last Updated : Jun 22, 2019, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details