కర్ణాటక బందీపుర్ అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే... సోమవారం ఓ గజరాజుకు కోపమొచ్చింది. ఎదురుగా అక్కడి రిసార్ట్‌కు సంబంధించిన వాహనం కనిపించింది. ఆ వాహనం వద్దకు కోపంతో దూసుకెళ్లి అద్దం బద్దలుగొట్టింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
గజరాజుకు కోపం- వాహనం అద్దం బద్దలు - కర్ణాటక
ఓ గజరాజుకు కోపమొచ్చింది. ఎదురుగా ఉన్న ఓ వాహనంపైకి దూసుకెళ్లి అద్దం బద్దలుగొట్టింది. కర్ణాటక బందీపుర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గజరాజుకు కోపం- వాహనం అద్దం బద్దలు
జూన్‌లో కర్ణాటక నుంచి కేరళ వెళ్తున్న ఓ బస్సుపైనా ఈ ప్రాంతంలోనే ఓ ఏనుగు దాడి చేసింది.