తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​పై నిషేధాన్ని ఎత్తేసిన మద్రాస్ హైకోర్టు - నిషేధం

టిక్​టాక్ యాప్​పై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. సుప్రీం ఆదేశాలకనుగుణంగా యాప్ భవితవ్యంపై నేడు తీర్పును వెల్లడించింది. కొన్ని పరిమితులను విధిస్తూ కార్యకలాపాలకు అనుమతించింది.

టిక్​టాక్​పై నిషేధాన్ని ఎత్తివేసిన మద్రాస్ హైకోర్టు

By

Published : Apr 24, 2019, 9:23 PM IST

Updated : Apr 25, 2019, 12:33 AM IST

వీడియో షేరింగ్ మొబైల్ యాప్ టిక్​టాక్​పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. అశ్లీలతను పెంపొందించే అభ్యంతరకరమైన వీడియోలు అప్​లోడ్ కాకుండా, షేర్​ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతోందన్న కారణంగాఈనెల 3న టిక్​టాక్​​పై మద్రాస్​ హైకోర్టులోని మధురై ధర్మాసనం నిషేధం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది యాప్​ను నిర్వహిస్తోన్న బైట్​ డాన్స్ సంస్థ.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 22న ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. టిక్​టాక్​పై తుది నిర్ణయాన్ని ఈనెల 24 లోగా తేల్చాలని మద్రాస్​ హైకోర్టును ఆదేశించింది.

సుప్రీం ఆదేశాలనుసారం నేడు టిక్​టాక్ వ్యాజ్యంపై విచారణ జరిపింది మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం. వీడియో షేరింగ్​ యాప్​పై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది.

Last Updated : Apr 25, 2019, 12:33 AM IST

ABOUT THE AUTHOR

...view details