తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వేళ తొలి దశ పోలింగ్​కు 'బిహార్​' సిద్ధం - తొలిదశ బిహార్​ పోలింగ్​

కరోనా సంక్షోభం వేళ దేశంలోనే తొలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బిహార్​ సమరంలో తొలి దశ పోలింగ్​లో భాగంగా 71 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

Bihar polls
బిహార్​ బరి: తొలిదశ పోలింగ్​లో 2.14 కోట్ల మంది

By

Published : Oct 27, 2020, 3:57 PM IST

Updated : Oct 27, 2020, 8:37 PM IST

బిహార్​ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్​వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి దశలో భాగంగా 71స్థానాలకు బుధవారం ఓటింగ్​ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

తొలి దశ పోలింగ్ వివరాలు

కరోనా నుంచి రక్షణ...

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్​ కేంద్రాల శానిటైజేషన్​ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.

ఓటర్లకు కరోనా జాగ్రత్తలు

పార్టీలు- స్థానాలు..

71 స్థానాల్లో ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూ 35 స్థానాలు, మిత్రపక్షం భాజపా 29 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహాకూటమి సర్దుబాట్లలో భాగంగా ఆర్​జేడీ 42, కాంగ్రెస్​ 20 చోట్ల పోటీపడుతున్నాయి. చిరాగ్​ పాసవాన్​ అధ్యక్షతన ఎల్​జేపీ 41 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగింది. ముఖ్యంగా జేడీయూ పోటీ చేస్తున్న 35స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది.

ఇదీ చూడండి:-బిహార్​ బరి: నితీశ్‌ పీఠం నిలిచేనా- ఓటరు ఎవరివైపు?

ప్రముఖులు..

ప్రస్తుత ప్రభుత్వంలోని కేబినెట్​ మంత్రులైన ప్రేమ్​ కుమార్​(గయా టౌన్​), విజయ్​ కుమార్​ సిన్హా(లఖిసరై), రామ్​ నారాయణ్​ మండల్​(బంక), కృష్ణానందన్​ ప్రసాద్​ వర్మ(జెహానాబాద్​), జైకుమార్​ సింగ్​(దినార), సంతోష్​ కుమార్​ నిరాలా(రాజ్​పుర్​) ఈ దఫా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కొత్తగా..

కామన్​వెల్త్​ గేమ్స్​లో​ షూటింగ్​లో బంగారు పతాకాన్ని దక్కించుకున్న 27ఏళ్ల శ్రేయాసి సింగ్​ ఈ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. భాజపా టికెట్​ మీద జముయి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆర్​జేడీకి చెందిన సిట్టింగ్​ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్​ నారాయణ్​ యాదవ్​ తనయుడు విజయ్​ ప్రకాశ్​ యాదవ్​పై పోటీకి దిగారు.

మరోవైపు జయప్రకాశ్​ నారాయణ్​ కుమార్తె కూడా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 28ఏళ్ల దివ్య ప్రకాశ్​.. ఆర్​జేడీ టికెట్​ మీద తారాపుర్​ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

అయితే గయా జిల్లాలోని ఇమామ్​గంజ్​లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుందని అంచనా. మాజీ ముఖ్యమంత్రి, సిట్టింగ్​ ఎమ్మెల్యే జితన్​ రామ్​ మాంజీ ఎన్​డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. అదే నియోజకవర్గంలో 2015వరకు సేవలందించిన ఉదయ్​ నారాయణ్​ చౌదరిని రంగంలోకి దింపింది ఆర్​జేడీ. జేడీయూను వీడి కొన్నేళ్ల క్రితమే ఆర్​జేడీ తీర్థం పుచ్చుకున్నారు ఉదయ్​.

ఇదీ చూడండి-బిహార్ బరి: 'నిరుద్యోగి'పైనే అందరి గురి

Last Updated : Oct 27, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details