కమలా హారిస్, కమలా హారిస్..ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచమంతా ఈ పేరు మారుమోగుతోంది. ఇక, భారత్ సంగతి సరే సరి. అమెరికా ఉపాధ్య పదవి చేపట్టి ఆమె చరిత్ర సృష్టిస్తే..భారత్‌లోని 'కమల'లు మాత్రం బంఫర్ ఆఫర్ కొట్టేశారు. ఆమె విజయానికి గుర్తుగా, జనవరి 24, 2021 సరదాగా గడిపే అవకాశాన్ని పొందారు. ఇంతకీ విషయం ఏంటంటే..
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేప్టటిన మొదటి మహిళగా కమలాహారిస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె భారత సంతతి మహిళ కూడా. అందుకే 'వండర్ లా' థీమ్ పార్క్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. దానికి గుర్తుగా కమల పేరుతో ఉన్న వ్యక్తులకు రేపు ఈ పార్క్‌ను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని అందించింది. దీనికి సంబంధించిన వివరాలను వండర్ లా ఫేస్బుక్లో పోస్టు చేసింది.