తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్లిప్పుల లెక్కింపుపై ఈసీ వివరణ కోరిన సుప్రీం

వీవీ ప్యాట్​ రశీదుల లెక్కింపుపై ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై ఈ నెల 28 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

వీవీప్యాట్

By

Published : Mar 25, 2019, 4:18 PM IST

Updated : Mar 25, 2019, 5:51 PM IST

వీవీప్యాట్
వీవీప్యాట్ రశీదుల నమూనా లెక్కింపును పెంచాలన్న అంశంపై ఈ నెల 28లోగా అఫిడవిట్​ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్​ బూత్​కు చెందిన వీవీప్యాట్​ రశీదులను మాత్రమే లెక్కిస్తున్నారు.

ఓటర్లను సంతృప్తిపరిచేందుకు దేశవ్యాప్తంగా వీవీప్యాట్​ రశీదుల లెక్కింపు సంఖ్యను పెంచే దిశగా ప్రయత్నించాలని ఈసీకి సూచించింది.

వీవీప్యాట్​ల పనితీరుపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ రశీదులను లెక్కించాలని కోరాయి. ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్​ 1కి వాయిదా వేసింది.

Last Updated : Mar 25, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details