దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల మేరకు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 4 స్థానాలు గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు నాలుగు వైకాపా తన ఖాతాలో వేసుకుంది.
మధ్యప్రదేశ్‌లో భాజపా 2 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించాయి. మధ్యప్రదేశ్‌లో భాజపా తరఫున జ్యోతిరాదిత్య సింధియా, సమీర్ సింగ్ సోలంకీ, కాంగ్రెస్ తరఫున సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ గెలుపొందారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 2, భాజపా ఒక చోట గెలుపొందాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నీరజ్ దంగి, భాజపా తరఫున రాజేంద్ర గహ్లోత్ పెద్దలసభకు ఎన్నికయ్యారు.
గుజరాత్‌లో మూడు స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ ఒక సీటుతో సరిపెట్టుకుంది.
ఝార్ఖండ్‌లో జేఎంఎం తరఫున శిబూ సోరెన్, సుమేర్‌సింగ్ గెలుపొందారు.
మేఘాలయలో ఎన్పీపీ అభ్యర్థి డబ్ల్యూఆర్ ఖర్లూఖి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్-4, గుజరాత్-4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్-3, ఝార్ఖండ్- 2, మణిపుర్, మిజోరాం, మేఘాలయలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఓటింగ్ జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.