తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటేశారా.. ఐతే మీకు 'మందు'పై డిస్కౌంట్ - హుబ్లి

కర్ణాటక ధార్వాడ్​ జిల్లాలో ఓటింగ్​ శాతం పెంచేందుకు వినూత్న పద్ధతిలో ఓటరు అవగాహన కల్పిస్తున్నారు ఓ వైన్​ షాప్​ వారు. ఓటు వేసిన వారికి మద్యంపై ప్రత్యేక డిస్కౌంట్​ ఆఫర్​ చేస్తోంది హుబ్లి నగరంలోని కర్ణాటక వైన్​ మార్ట్​. 23న వేలిపై ఓటు వేసిన ఇంకు మార్క్ చూపిస్తే... 24న మద్యంపై 3 శాతం తగ్గింపు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.

వేలిపై ఇంకుంటే మందుబాబులకు డిస్కౌంట్ ఆఫర్

By

Published : Apr 22, 2019, 7:34 PM IST

వేలిపై ఇంకుంటే మందుబాబులకు డిస్కౌంట్ ఆఫర్
ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు బాగానే చేపడుతోంది. అయినా రకరకాల కారణాలతో ఓటింగ్ శాతంలో పెద్దగా పెరుగుదల ఉండట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా కొందరు వివిధ మార్గాల ద్వారా ఓటరు అవగాహన కార్యక్రమాలను వినూత్నంగా చేపడుతున్నారు.

కర్ణాటక ధార్వాడ్​ జిల్లా హుబ్లి నగరంలోని కోర్టు సర్కిల్​ సమీపంలో గల కర్ణాటక వైన్​ మార్ట్​ యాజమాన్యం తమదైన శైలిలో ఓటరు అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ నెల 23న జరిగే లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తమ దుకాణంలో ప్రత్యేక తగ్గింపు ధరలు ప్రకటించింది. 23న ఓటు వేసి వేలికి ఇంకు అంటించుకున్న వారికి... 24న వైన్​ మార్ట్​లో మద్యంపై 3 శాతం డిస్కౌంట్​ కల్పిస్తోంది.

ఆ ఒక్క రోజునే ఆఫర్​ అమలులో ఉంటుంది. ఈ మేరకు దుకాణం ముందు బ్యానర్​ ఏర్పాటు చేశారు.

పార్టీలు పంచే మద్యానికి ఆశపడి ఓటు వేయకూడదని... మద్యం ప్రియులకు ప్రత్యేక ఆఫర్​ ఇస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.

ఇదీ చూడండీ:మూడో విడత పోలింగ్​కు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details