ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో ఉగ్రవాదులు ఆరితేరారు. పుల్వామా దాడిపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడి కోసం అత్యాధునిక వర్చువల్ సిమ్‌లను వినియోగించారని వెల్లడైంది. ఈ సిమ్‌ల సమాచారాన్ని ఛేదించడానికి అమెరికా సాయాన్ని కోరింది భారత్.
పుల్వామా ఘటన తర్వాత త్రాల్‌తో సహా ఇతర చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. దొరికిన ఆధారాల బట్టి చూస్తే పుల్వామా దాడికి పాల్పడిన ఆదిల్ దార్ దాడి చేసేంత వరకు సూత్రధారి ముదసిర్ ఖాన్‌తో సంభాషించినట్లు అధికారులు చెప్పారు.
వర్చవల్ సిమ్‌లో ఎలా ...
వర్చువల్ సిమ్ సర్వీస్ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్ ఆధారిత ఫోన్ నెంబర్‌ను సృష్టిస్తారు. దీనిని వినియోగించేందుకు ఫోన్లో సర్వీసు ప్రొవైడర్ అప్లికేషన్ ఉండాలి. సోషల్ మీడియా ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. దీని నెంబర్లు ‘+1’తో ప్రారంభమవుతాయి. ఇలాంటి నెంబర్లను వాడటం కోసం వినియోగించే దే 'మొబైల్ స్టేషన్ ఇంటర్నెషనల్ సబ్‌స్క్రైబర్ డైరెక్టరీ' (ఎంఎస్‌ఐఎస్‌డీఎన్).