తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల ఆలయ దర్శనానికి టోకెన్​ పద్ధతి

కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయంలో దర్శనానికి టోకెన్​ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్​ తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆలయ ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

sabarimala
శబరిమల

By

Published : Jun 6, 2020, 3:16 PM IST

శబరిమల ఆలయంలో వర్చువల్​ క్యూ పద్ధతి​ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఈ విధానంలో ఒకేసారి 50 మందికి వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

దర్శనంలో భాగంగా నీలక్కళ్, పంబా, సన్నిధానంలో శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు థర్మల్​ స్కానర్లు ఏర్పాటు చేస్తామని విజయన్​ తెలిపారు. ఆలయ దర్శన పునరుద్ధరణలో భాగంగా తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.

  • దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించటం తప్పనిసరి
  • దేవాలయ సిబ్బంది కూడా మాస్కులు, గ్లౌజులు ధరించాలి
  • నెయ్యాభిషేకం కోసం ఉపయోగించే నెయ్యిని అందించేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
  • పూజారులు ప్రసాద వితరణ చేయకూడదు
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారికి ప్రవేశం లేదు
  • కొడియెట్టు, అరట్టు వంటి వేడుకలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
  • భక్తులకు టోకెన్ల (వర్చువల్​ క్యూ సిస్టమ్​) ద్వారా ప్రవేశానికి అనుమతి

అయితే ఇతర రాష్ట్రాల భక్తుల దర్శనానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం విజయన్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:జులై 21 నుంచి అమర్​నాథ్​ యాత్ర.. ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details