తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్: ప్రధాని ఒడిలో ఆడుకున్న చిన్నారి ఎవరు? - guest

బిజీ షెడ్యూల్​ను మరచి, తన వద్దకు వచ్చిన ప్రత్యేక అతిథితో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించారు. ఆ ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు.

ప్రధానితో చిన్నారి అతిథి

By

Published : Jul 23, 2019, 5:08 PM IST

Updated : Jul 23, 2019, 6:39 PM IST

దేశ ప్రగతిని గురించి ప్రణాళికలు, చట్టసభలో సవాళ్లు, అధికారులకు ఆదేశాలు, దేశ పురోగతి గురించిన సమీక్షలు, విదేశీ పర్యటనలు ఇలా రోజూవారి షెడ్యూల్​తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో బిజీ. ప్రధాని బాధ్యతల్లో ఉన్నవారు పనిలో ఆనందం వెతుక్కుంటూ సాగిపోతుంటారేమో అనిపిస్తుంది. ఇలా బిజీబిజీగా గడిపే ప్రధాని మోదీ ఓ చిన్నారితో ఆడుకోవడం ఆశ్చర్యమే మరి. పార్లమెంట్​లోని తన కార్యాలయంలో చిన్నారిని ఎత్తుకుని లాలించారు ప్రధాని.

ప్రధానితో చిన్నారి అతిథి

"ఓ ప్రత్యేక అతిథి నన్ను కలవడానికి ఈ రోజు పార్లమెంట్​కు వచ్చారు" అంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు ప్రధాని. వెంటనే.. కామెంట్లు వెల్లువెత్తాయి. ఆ చిన్నారి ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కాసేపటికే ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారింది.

ప్రధాని వద్దకు వచ్చిన ఈ బుల్లి అతిథి... భాజపా ఎంపీ సత్యనారాయణ జతియా మనుమరాలని తర్వాత తెలిసింది.

సత్యనారాయణ జతియా కుటుంబంతో ప్రధాని

ఇదీ చూడండి: బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం

Last Updated : Jul 23, 2019, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details