దిల్లీలో పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. జామియా వర్శిటీ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 35మంది గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి 11మందిని అడ్మిట్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
జేఎన్యూ విద్యార్థుల ఆందోళన..
జామియా విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినందుకు దిల్లీలో పాత పోలీసు ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు జేఎన్ఎస్యూ విద్యార్థులు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు మెట్రో స్టేషన్ల మూసివేత..
దక్షిణ దిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జీటీబీ నగర్, శివాజీ స్టేడియం, పటేల్ చౌక్, విశ్వవిద్యాలయ స్టేషన్లలో సేవలను నిలిపి వేశారు.
ఇదీ జరిగింది
పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దక్షిణ దిల్లీలో ఆందోళనకు దిగారు నిరసనకారులు. మూడు బస్సులు, ఓ అగ్నిమాపక యంత్రాన్ని తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన కారణంగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి, లాఠీఛార్జీ చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోకి పరుగులు తీశారు.
ఇదీ చూడండి: 'పౌర'చట్టంపై దిల్లీ జామియా వర్శిటీలో రగడ