మత, సామాజిక స్థితి ప్రాతిపదికన భారత్లో మైనారిటీలపై హింస, వివక్ష సహా మానవహక్కుల సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. బుధవారం విడుదల చేసిన అధికారిక నివేదికలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.
'భారత్లో మత, సామాజిక స్థితి ప్రాతిపదికన మైనారిటీలపై హింస'
భారత్లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అమెరికా అధికారిక నివేదికను విడుదల చేసింది. మత, సామాజిక స్థితి ప్రాతిపదికన ఈ హింసాకాండలు జరగుతున్నట్లు పేర్కొంది.
'భారత్లో మత, సామాజిక స్థితి ప్రాతిపదికన మైనారిటీలపై హింస'
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విడుదల చేసిన ఈ నివేదిక.. భారత్లో హత్యలు, ఖైదీలపై అధికారుల చిత్రహింసలు, ఏకపక్ష అరెస్టులు, జైళ్లలో అధ్వాన్న పరిస్థితులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర నేరాలు, మానవహక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.