తెలంగాణ

telangana

లాక్​డౌన్​ ఉల్లంఘనలపై రాష్ట్రాలకు కేంద్రం మందలింపు!

By

Published : May 21, 2020, 8:59 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను హెచ్చరించింది. మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

MHA-LOCKDOWN
లాక్​డౌన్​ ఉల్లంఘనలపై రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం

దేశంలో చాలా చోట్ల లాక్​డౌన్​ ఉల్లంఘనలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. కంటెయిన్​మెంట్​ జోన్లలో మార్గదర్శకాలు ఖాతరు చేయట్లేదని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రి పూట కర్ఫ్యూను కచ్చితంగా పాటించాలని.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.

"మీడియా నివేదికలతో చాలా ఉల్లంఘనలు హోంశాఖ దృష్టికి వచ్చాయి. మేం మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అమలు చేయాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి."

- అజయ్​ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

ఇప్పటికే లాక్​డౌన్​ 4.0 నేపథ్యంలో మార్గదర్శకాలను నీరుగార్చవద్దని మే 18న కేంద్ర హోంశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. అయినప్పటికీ నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంపై మరోసారి స్పందించింది హోంశాఖ.

ABOUT THE AUTHOR

...view details