ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణపై ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వాసం ప్రకటించారు. నిన్న ల్యాండర్ జాడ కనిపెట్టిన ఇస్రో... నేడు విక్రమ్ పరిస్థితిపై పురోగతి సాధించింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ఒరిగి ఉంది తప్ప ముక్కలు కాలేదని ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.
‘నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా 'విక్రమ్' హార్డ్ ల్యాండ్ అయింది. ఆర్బిటర్ పంపిన థర్మల్ ఛాయాచిత్రాల ద్వారా గమనించాం. ల్యాండర్ సింగిల్ పీస్‌గానే ఉంది. ముక్కలు కాలేదు. ల్యాండర్‌తో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం’ - ఇస్రో అధికారులు