తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్​: రూ.50 లంచం తీసుకున్న పోలీస్ సస్పెండ్​​ - conistable accepting 50 rupees

ఓ కానిస్టేబుల్ దుర్బుద్ధికి పరాకాష్ఠ ఇది. వేరుశెనగలు కొనేందుకు ఓ వ్యాపారిని యాభై రూపాయిలు డిమాండ్​ చేసి.. తన ఉద్యోగానికి దూరమయ్యాడు ఆ రక్షకభటుడు. ఆయన లంచం అడుగుతున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.

Video of UP cop accepting Rs 50 as bribe goes viral; suspended by SP
రూ.50 లంచం తీసుకున్న పోలీస్​

By

Published : Feb 19, 2020, 5:56 PM IST

Updated : Mar 1, 2020, 8:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖాక్రేరు పోలీస్​స్టేషన్​లో పనిచేస్తున్న హెడ్​ కానిస్టేబుల్ అశోక్​కుమార్​ను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఓ చిరు వ్యాపారిని రూ.50 లంచం డిమాండ్​ చేయడంతో ఆయనపై వేటు వేశారు.

అశోక్​కుమార్ లంచం అడుగుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్​ అవుతోంది. వేరుశెనక్కాయలు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించగా రూ.50ను కానిస్టేబుల్​కు ఇచ్చాడా వ్యాపారి. ఈ వీడియో ఆధారంగా స్థానిక ఎస్పీ ప్రశాంత్ వర్మ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు. ఒక్క రూపాయి అయినా, రూ.1000 అయినా లంచం లంచమే అని, ఎవరు తీసుకున్నా వేటు తప్పదని హెచ్చరించారు ఎస్పీ.

ఇదీ చదవండి:అమెరికాలో భారత సంతతి న్యాయమూర్తికి అరుదైన ఘనత

Last Updated : Mar 1, 2020, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details