యూపీ మేరఠ్ జిల్లా గగోల్ గ్రామంలో ఓ వృద్ధుడి మరణం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ స్థానికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. తన గ్యారేజ్‌కి వెళ్లిన వృద్ధుడు ఏదో తనను చట్టుముట్టినట్లు కంగారు పడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పాడు.
ఈ నెల 19న.. జురాన్పుర్లో ఉన్న తన గ్యారేజ్‌కి వెళ్లిన ఇర్షాద్ అనే వృద్ధుడు.. ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు బంధువులు. ఇర్షాద్ రాక ముందే దుకాణ ప్రాంగణంలో చక్కర్లు కొడుతూ కనిపించింది ఓ నల్లని ఆకారం. మామూలుగా నడుచుకుంటూ వస్తున్న ఇర్షాద్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతడి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు అనిపించి చుట్టూ చూశాడు. అంతే.. తీవ్రంగా భయపడ్డ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. నిల్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు.