ఉత్తమ గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఫేస్‌బుక్‌లో ఆయన తన మనోగతాన్ని తెలియజేశారు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని పేర్కొన్నారు.
'గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం'
గురుపౌర్ణమి సందర్భంగా ఫేస్‌బుక్‌లో తన మనోగతాన్ని తెలియజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని పేర్కొన్నారు. గురు, శిశ్యుల బంధంతోనే ఉన్నత సమాజం సాకారమవుతుందన్నారు.
గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం
15 నెలలకే తల్లిని కోల్పోయిన తనకు అమ్మమ్మ, తాతయ్య తొలి గురువులుగా నిలిచారని తెలిపారు వెంకయ్య. తన గురువులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తనలో రాజకీయ స్ఫూర్తిని నింపిన తెన్నేటి విశ్వనాథం, లాల్ కృష్ణ ఆడ్వాణీలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌పై గురి!