తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభలో ఏర్పాట్లను పరిశీలించిన ఉపరాష్ట్రపతి - పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు

త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో రాజ్యసభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మొత్తం 45 నిమిషాల పాటు ఏర్పాట్లను పరీక్షించిన ఆయన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Vice President M Venkaiah Naidu attends Rajya Sabha mock-drill
రాజ్యసభలో ఏర్పాట్లను పరిశీలించిన ఉపరాష్ట్రపతి

By

Published : Aug 28, 2020, 7:03 AM IST

వచ్చే నెలలో ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభలో చేపట్టిన ఏర్పాట్లను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కొవిడ్​ నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనల మేరకు సభ్యులు రాజ్యసభ, లోక్​సభలోని 4 గ్యాలరీలతో పాటు రెండు సభల్లోని ఛాంబర్లలో కూర్చోనున్నారు. సమావేశాల ఏర్పాట్లపై నిర్వహించిన మాక్​ డ్రిల్​ను ఉపరాష్ట్రపతి 45 నిమిషాల పాటు పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయసభల్లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లు, సమాంతర అనువాదం, మైకులు తదితర ఉపకరణాల పనితీరును గమనించారు.

రెండు సభల మధ్య రియల్​టైమ్​లో ఆడియో, వీడియో సిగ్నల్స్​ ప్రసారానికి వీలుగా ప్రత్యేక ఆప్టికల్​పై కాలు చేసేటప్పుడు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకు ఆరు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా, కొవిడ్​-19 మహమ్మారి నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భౌతిక ఎడం నిబంధనల అమలుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా గురువారం ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండిఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్​పై భారత్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details